విజయానికి వయసు అడ్డుకాదు

యాభై ఏళ్లు వచ్చేసరికి ముప్పావు జీవితం అయిపోయిందని మూలన కూర్చుంటాం. తుర్లపాటి లలిత చూడండి. హాఫ్‌సెంచరీ తరువాతే హాయిగా ఈతకొలనులో కెరీర్‌ మొదలుపెట్టారు. ఆ వయసు స్విమ్మర్లతో పోటీపడుతూ పతకాల పంట పండిస్తున్నారు..
తపనకు వయసుతో పనుండదు.వయసుకు శరీరంతోనే పని.. కానీ విజయానికి కాదు. చేయాలనే కసి, తపన ఉండాలే గానీ ఏ వయసులోనైనా.. ఎలాంటి కష్టమైనా ఇష్టంగా మనముందు తలవంచుతుంది. తుర్లపాటి లలితాసరోజ అరవై ఏళ్ల వయసులో.. స్విమ్మింగ్‌పూల్‌లో అడుగుపెట్టి.. జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తున్నారు. న్యూజిల్యాండ్‌లో జరగనున్న అంతర్జాతీయ ఈత పోటీల కోసం సన్నద్ధమవుతున్నారు. కొందరు నీళ్లను చూస్తే జంకుతారు. ఇంకొందరు సరదాగా ఆడాలనుకుంటారు. కానీ అరవై ఏళ్ల వయసులో.. ఈత నేర్చుకోవాలని ఎవరు అనుకుంటారు. హైదరాబాద్‌ సోమాజిగూడకు చెందిన తుర్లపాటి లలితాసరోజ గురువు లేకుండానే ఈత నేర్చుకున్నారు.
”అసలు నేను నేషనల్స్‌కు వెళతానని, ఇన్నేసి బంగారు పతకాలు కొడతానని ఊహించనేలేదు. చాలామంది నమ్మరు కానీ.. నేను స్విమ్మింగ్‌ లో చిన్న శిక్షణ కూడా తీసుకోలేదు. అనుకోకుండా ఈతకొలనులోకి దిగాను. ముందు మా కుటుంబ విషయాలకు వస్తే – మాది హైదరాబాద్‌. నా భర్త వ్యాపారవేత్త. ఇద్దరు పిల్లల్లో ఒకరు అమెరికాలో స్థిరపడ్డారు. ఇంకొకరు ఇక్కడే ఉంటారు. ఇంట్లోని పనులతోనే నాకు సరిపోయేది. ఈత మీద ధ్యాస ఉండేది కాదు. బీఏ, బీఈడీ చదువుకున్నాను. కొన్నాళ్లు మాత్రమే ఉద్యోగం చేశాను కానీ.. కొనసాగించలేదు. పిల్లలకు పెళ్లిళ్లు పూర్తయి కుదుటపడ్డాక.. సమయం దొరికేది. అయితే ఏదో ఒకటి చేయాలన్న లక్ష్యాలేవీ ఉండేవి కావు. ఒక సందర్భంలో – వయసు మీదపడటంతో కీళ్ల నొప్పుల సమస్యలు వచ్చాయి. వైద్యచికిత్స కోసమని డాక్టర్‌ దగ్గరికి వెళ్లాను. నా ఫిట్‌నెస్‌ చూసిన డాక్టర్‌ స్విమ్మింగ్‌ చేయమని సలహా ఇచ్చింది. అప్పుటికి నా వయసు యాభైఏళ్లు. అంతవరకు స్విమ్మింగ్‌తో నాకు ఎటువంటి పరిచయం లేదు. దీన్నొక కెరీర్‌గా ఎంచుకోవచ్చన్న ధ్యాస కూడా ఉండేది కాదు. సరదాగా ఈత మొదలుపెట్టి.. సీరియ్‌సగా తీసుకున్నాను. ఇంటికి దగ్గర్లోని ఒక ఇండోర్‌ స్విమ్మింగ్‌పూల్‌లో తొలిసారి స్విమ్‌ చేశాను. ఆ తరువాత పెద్ద ఈతకొలనుకు వెళ్లేదాన్ని. ఈతలో వేగం పెరిగితే.. నా వయసు వాళ్లకు నిర్వహించే పోటీల్లో పాల్గొనవచ్చని తెలిసింది. పట్టుదలతో మరింత కఠినమైన ప్రాక్టీస్‌ చేసి.. టోర్నమెంట్‌లలో పాల్గొనడం ప్రారంభించాను. కుటుంబ సభ్యులు కూడా అడ్డుచెప్పలేదు. ఫలితం కోసం ఆశించకుండా ప్రోత్సహించారు.
తొలిసారి గెలిచి..
అది 2012. ఈతపోటీల్లో పాల్గొనడం అదే మొదటిసారి. రాష్ట్రస్థాయి పోటీల్లో ధైర్యంగా పాల్గొన్నాను. తొలిసారి బంగారు పతకాలు నా ఖాతాలో పడ్డాయి. నా మీద నాకు నమ్మకం పెరిగింది. ఆ తరువాత భోపాల్‌లో జరిగిన నేషనల్స్‌లో ఒక గోల్డ్‌మెడల్‌ వచ్చింది. ఈ పోటీల్లో తీవ్రమైన పోటీ ఎదుర్కొన్నాను. ఎందుకంటే దేశవ్యాప్తంగా క్రీడాకారులు వచ్చారక్కడికి. ఇవన్నీ మాస్టర్స్‌ టోర్నమెంట్స్‌. 25 ఏళ్ల నుంచి 75 ఏళ్ల వయస్కుల మధ్య ఈ పోటీలు జరుగుతాయి. ఐదేళ్ల వ్యత్యాసంతో పోటీ విభాగాలను నిర్దేశిస్తారు. అంటే యాభై నుంచి యాభై ఐదేళ్ల మధ్య వయస్కులు ఒక విభాగం అన్న మాట. వారి మధ్యనే ఈతపోటీలు జరుగుతాయి. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో నా వయసు వాళ్లు అతితక్కువ మంది ఈతపోటీల్లో పాల్గొనేవారు. ఇప్పుడు వారి సంఖ్య పెరిగింది. జాతీయ స్థాయిలో అయితే అత్యధికంగా ఉంది.
పతకం.. పదిలం
ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో ఎనిమిది బంగారు పతకాలు, జాతీయస్థాయిలో పదకొండు పతకాలు గెల్చుకున్నాను. ఈ మధ్యనే సికింద్రాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి ఈత పోటీల్లో పతకాలు సాధించడం చాలా సంతోషంగా అనిపించింది. నా మీద నాకు ఆత్మ
విశ్వాసం మరింత పెరిగింది. తెలంగాణ స్టేట్‌ మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ టోర్నమెంట్‌లో కూడా మంచి ఫలితాలు దక్కాయి. చాలామంది నన్ను అడుగుతుంటారు.. ‘నువ్వు ఈతలో అంత నైపుణ్యం ఎలా సాధించావని’. నేనేమీ స్విమ్మింగ్‌ అంత కష్టమని భావించలేదు. ఈతలో రకరకాల స్టోక్స్ర్‌ ఉంటాయి. ప్రీస్టయిల్స్‌, బటర్‌ఫ్లై వంటివన్నీ స్వయంగా నేర్చుకున్నాను. నాకు ఏ మాత్రం సందేహం వచ్చినా ఇంటర్‌నెట్‌ను చూసేదాన్ని. స్పోర్ట్స్‌లో ఎన్నిరకాల స్విమ్మింగ్‌ స్టోక్స్ర్‌ ఉన్నాయో అవన్నీ ఇంటర్‌నెట్‌లో చూసి నేర్చుకోవచ్చు. నాది చిన్న విజయమే కావొచ్చు. కానీ.. జీవితాన్ని ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా తీర్చిదిద్దుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఈ వయసులో ఇంటికే పరిమితం కాలేదు నేను. నాకొక వ్యాపకం అలవాటైంది. ఈత కొడుతూ ఒక వైపు ఆరోగ్యాన్ని, మరోవైపు పతకాలను గెల్చుకుంటున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తున్నది.
ఒకవైపు ఈత కొడుతూ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకున్నారు. పోటీల్లో పాల్గొంటూ పతకాలనూ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో న్యూజిలాండ్‌లో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో తక్కువ మంది మహిళల్లో ఒకరిగా నిలువనున్నారు. లేటు వయసులో అరుదైన స్విమ్మర్‌గా విజయాలకు కేరాఫ్‌గా నిలిచారు లలిత.
కాలక్షేపం.. వ్యాయామం
లలిత మొన్నటి వరకు సాధారణ గహిణి. ఇల్లు.. పిల్లలు, కుటుంబసభ్యులు.. ఇదే ఆమె జీవితం. ఒక ఆలోచన, ఒక సందర్భం.. ఆమెను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఒళ్లు నొప్పుల కారణంగా ప్రారంభించిన ఈత, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేంత వరకు తీసుకెళ్లింది. నీళ్లంటే భయపడే ఓ మహిళ ఆరోగ్యం కోసం వ్యాయామం మొదలుపెట్టారు. ఆరుపదుల వయసు, కాలక్షేపం చేయాల్సిన మనసు, మనవళ్లను ఆడిస్తూ జీవితాన్ని ఎంజాయ్‌ చేయాల్సిన లలిత వీటికి భిన్నంగా చేస్తున్నారు. ఆరోగ్యం కోసం ప్రారంభించిన ఈత పోటీల వరకు వెళ్తుందని లలిత ఎప్పుడు అనుకోలేదట. అనుకోకుండా ఈత కొలనులో దిగి ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. 62 ఏళ్ల వయసులో యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆరోగ్యం పదిలం
వయసు మీద పడడంతో కీళ్ల నొప్పులు వచ్చాయి. వైద్య చికిత్స కోసం హాస్పిటల్‌కి వెళ్తే ఫిట్‌నెస్‌ కోసం స్విమ్మింగ్‌ చేయమని సలహా ఇచ్చారు. అప్పటి వరకు స్విమ్మింగ్‌తో ఎలాంటి పరిచయం లేదు. సరదాగా మొదలుపెట్టి ఆ తర్వాత సీరియస్‌గా తీసుకున్నారు. చిన్న పూల్‌లో మొదలైన ఈత ఇప్పుడు పెద్ద పెద్ద పూల్స్‌లో కూడా అలవాటైంది. బీఈడీ చదివిన లలిత పెళ్లికి ముందు ఉద్యోగం చేశారు. నెలరోజులు కష్టపడి కోచ్‌ లేకుండా ఈత నేర్చుకున్నారు. ఈతలో వేగం పెరిగితే తన వయసు వాళ్లు కూడా పోటీల్లో పాల్గొనచ్చని తెలుసుకుని పట్టుదలతో మరింత ప్రాక్టీస్‌ చేశారు. కుటుంబసభ్యుల ప్రోత్సాహం కూడా తోడవడంతో ఈ పని ఇంకా సులువు అయింది.
అన్నింట్లో ఆదర్శం
రోజూ ఉదయం గంటన్నర సేపు స్విమ్మింగ్‌ ప్రాక్టీస్‌తో పాటు జిమ్‌ కూడా చేస్తారు. ఇంట్లో పని పూర్తి చేసి ఖాళీగా ఉండలేక లలిత కుట్లు, అల్లికలు కూడా వేస్తుంటారు. వీటితో పాటు పెయింటిగ్స్‌ గీస్తున్నారు. ఇంట్లో హాల్‌ని తన ఆయిల్‌ పెయింటింగ్స్‌తో నింపేశారు. ఎవరిమీద ఆధారపడకుండా సొంతగా కారు డ్రైవ్‌ చేసుకుంటూ ప్రాక్టీస్‌కు వెళ్తున్నారు. ఇంట్లో క ష్ణా.. రామా.. అంటూ కాలం వెల్లదీయాల్సిన వయసులో ఇన్ని రంగాల్లో రాణిస్తున్న లలితను చూసి కుటుంబసభ్యులు గర్వపడుతున్నారు. ఇంటి పనులు చేయడానికి ఆరోగ్యం సహకరించని వయసులో కూడా ఉరకలెత్తే మనసుంటే వయసు ఆటంకం కాదంటున్నారు.
మొదటి విజయం
2012 లో తొలిసారి ఈత పోటీల్లో పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని తొలిసారి బంగారు పతకాన్ని సాధించారు. దాంతో నమ్మకం పెరిగింది. ఇంకా గెలవాలనే తపన కలిగింది. భోపాల్‌లో జరిగిన నేషనల్స్‌ కూడా గోల్డ్‌ మెడల్‌ సాధించారు, దేశవ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొన్నారు. 25 నుంచి 75 ఏళ్ల వయస్కులు వ్యత్యాసంతో పోటీపడతారు. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయిలో పది బంగారు పతకాలు, 13 వెండి పతకాలు గెలుచుకున్నారు. ఫ్రీ స్టయిల్‌, బటర్‌ ట్కఫ్లె అంశాల్లో సొంతంగా నేర్చుకున్నారు. ఆటలకు సంబంధించిన ఎలాంటి సందేహం వచ్చినా ఇంటర్‌నెట్‌ ద్వారా తెలుసుకుంటారు. ఇంటికే పరిమితం కాకుండా వ్యాపకంగా అలవాటు చేసుకున్నారు. రోజూ ఉదయం సికింద్రాబాద్‌ కంట్రీక్లబ్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నారు. 100 మీటర్ల పూల్‌లో 50 రౌండ్లు వేసి మరింత శ్రమిస్తున్నారు. బ్యాక్‌ స్ట్రోక్‌, ఫ్రంట్స్‌ స్ట్రోక్‌లు కూడా వేస్తున్నారు. ఫ్రీ స్టయిల్‌, బటర్‌ట్కఫ్లె స్టయిల్‌లో ఆరితేరారు.