కొత్తా..దేవుడండీ!

కరోనా ప్రభావంతో దశావతారాల తర్వాత వచ్చిన కల్కికి కొనసాగింపే ఈ ఆన్లైన్ అవతారం

  • నెల రోజుల పైగా దేశంలోని ఆలయాలన్నీ మూసివేత
  • భక్తులు లేకున్నా నిత్యపూజలు యథాతథం
  • కోట్లలో ఆలయాల ఆదాయాలకు గండి
  • ఒక్క తిరుమలకే రూ.250 కోట్లకు పైగా నష్టం
  • అందుకే ఆన్లైన్ పూజలు, దర్శనాలకు అనుమతి
  • ఇంటి సభ్యుల గోత్రనామాలతో ప్రత్యేక పూజలు
  • ఆన్‌లైన్లో ఆదాయ మార్గాలు వెతుక్కుంటున్న ఆలయాలు
  • పూజారులు, సిబ్బంది జీతాలు, నిర్వహణకు ఖర్చులు
  • ఆన్ లైన్ పూజలకు మొగ్గుచూపుతున్న జనాలు
  • దేశంలోని అన్ని ప్రధాన ఆలయాలదీ ఇదే దారి

హైదరాబాద్:దేవుడు సృష్టించిన మానవాళి కరోనా దెబ్బకు కకావికలవుతోంది. మరి మనిషి తనకిష్టమైన రూపంగా మలుచుకున్న ఆ దేవుడికీ తప్పడం లేదు కరోనా ప్రభావం. మనిషి తాను తలుచుకుంటే చంద్రమండలం మీద కూడా ఆ దేవుడికి గుడి కడతాడు. సాంకేతికంగా ఎంతో ఉన్నత స్థాయికి చేరిన మనిషికి సైతం ఆ భగవంతుడి లీలలు మాత్రం అర్థం కాకున్నాయి. దేవుడికి కూడా భయపడని మానవుడు ఒక్కసారిగా కరోనా ముందు మోకరిల్లే స్థాయికి చేరుకుని..ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. స్వీయ నిర్బంధం పేరిట గృహానికే పరిమితం అవడంతో ప్రముఖ ఆలయాలన్నీ కూడా మూతబడ్డాయి. ఇక మనుషులను తన గుడి వద్దకు రప్పించుకోవడానికి కొంత కాలం పట్టవచ్చు. అందుకే ఆ దేవుడు సరికొత్త అవతారం ఎత్తాలనుకుంటున్నాడు. అదే దశావతారాల తర్వాత వచ్చిన 11వ ఆన్లైన్ అవతారం.ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఆలయాల మీద పడింది. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు కరోనా వైరస్ నేపధ్యంలో భక్తుల సందర్శనను నిలిపివేసి కేవలం నిత్య పూజలు కొనసాగిస్తున్నాయి ఇక కరోనా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో దాదాపు నెలరోజులుగా భక్తులు ఆలయాలకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. అందుకే భక్తుల సౌకర్యార్ధం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని ఆన్ లైన్ పూజలు నిర్వహించటానికి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. కరోనా కాలంలో గుడికి వెళ్ళటానికి ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్ పూజలు కరోనా కాలంలో గుడికి వెళ్లి పూజలు చేయించుకోలేక పోతున్నాం అని దిగులు చెందుతున్న వాళ్ళ కోసం ఈ సదు పాయం అందుబాటులోకి తెచ్చాయి ప్రభుత్వాలు . దేవున్ని నేరుగా ఆలయానికి వెళ్లి చూడకపోయినప్పటికీ ఆన్ లైన్లో అర్చనలు, పూజలు చేయించే అవకాశం కల్పిస్తుంది. తెలంగాణా దేవాదాయ శాఖ లాక్ డౌన్ దృష్ట్యా భక్తులసౌకర్యార్థం ఆన్లైన్ పూజలకు శ్రీకారం చుట్టింది . తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలలో దేవాదాయ శాఖ ఆన్లైన్ పూజలు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. తెలంగాణా ప్రముఖ ఆలయాలలో ఆన్లైన్ ఆర్జిత సేవలు ఆన్ లైన్ పూజలు నిర్వహించే ఆలయాల జాబితాలో ఉన్న ప్రధాన ఆలయాలు చూస్తే యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ,వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, కొండగట్టు హనుమాన్ దేవాలయం, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం, బాసరజ్ఞాన సరస్వతి దేవాలయం, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలు ఉన్నాయి. ఆన్ లైన్ లో రుసుమును చెల్లించి, గోత్రనామాలను పంపితే పూజలు ఇక ఈ ఆలయాల్లో పూజలు చేయించడానికి భక్తులు ఆన్ లైన్ లో రుసుమును చెల్లించి, గోత్రనామాలను పంపించాలి. వారి పేరిట ఆలయ అర్చకులు పూజలు నిర్వహిస్తారు. ఆలయంలో సాధారణ అర్చన, పూజలకు ఒక రేటు, సుదర్శనహెూమానికి చేయించడానికి ఇంకో రేటు .. ఏది ఏమైనా రుసుమును వెబ్ సైట్ లో చెల్లించి పూజలు చేయించుకోవచ్చని ఆలయ అధికారులు చెప్తున్నారు. ఇక ఏపీలోనూ ఇప్పటికే ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇంటి నుంచే ఆన్లైన్లో దర్శన సమయాన్ని బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది ఏపీ సర్కార్ . రాష్ట్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఆలయాలను గుర్తించి, అక్కడ ఈ సదుపాయాన్ని కల్పించింది. కాణిపాకం ఆలయంలో ఆన్ లైన్ లో పూజలు చేస్తున్న అర్చకులుప్రస్తుత కరోనా సమయంలో కొనసాగుతున్న లాక్ డౌన్ నేపధ్యంలో ఆన్ లైన్ సేవలు వినియోగించుకోవచ్చని చెప్తుంది . ఆన్ లైన్ లో పూజల బుకింగ్ చేసుకోవచ్చని దేవాదాయ శాఖ స్పష్టం చేసింది. ఇక కరోనా సమయంలో స్వామి వారినిదర్శించుకోవాలనుకునే వారికి కాణిపాకం దేవస్థానం ఆన్ లైన్ లో పూజలు నిర్వహిస్తుంది . కాణిపాకం ఆలయంలో భక్తులు పరోక్షంగా పూజలు, మొక్కులు స్వామివారి సేవలు నిర్వహించుకునేలా అవకాశం ఇవ్వనుంది.కరోనా . మహమ్మారి రాక ముందు వరకు ప్రత్యక్షంగా సేవలో పాల్గొన్న భక్తులు పరోక్షంగా వారి పేర్లతో పూజలు, హెూమాలు నిర్వహించుకునే అవకాశం కల్పించింది. భగవంతుడికీ భక్తుడికీ అనుసంధానంగా ఆన్ లైన్ పూజలుమొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో దేవుళ్ళు ఆన్ లైన్ లో భక్తులను కరుణించనున్నారు. దేవాలయాలకు వెళ్ళటం లేదని దిగులు పడే భక్తులకు ఆన్ లైన్ లో దర్శన భాగ్యం కల్పించనున్నారు. వారి పేర్ల మీద పూజలు నిర్వహించనున్నారు . కరోనా వైరస్ తో లాక్ డౌన్ కొనసాగుతున్న భగవంతుడికీ భక్తుడికీ అనుసంధానమైనది ఆన్ లైన్ . ఇంకేం పూజలు, పునస్కారాలతో లాక్ డౌన్ ఆన్ లైన్ లో పూజలతో గడి పెయ్యండి. తిరుపతికి రూ.250 కోట్ల నష్టం కరోనా వైరస్ నేపధ్యంలో లాక్ డౌన్ ప్రభావం సామాన్యుల పైనే కాదు.తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి పై కూడా పడింది. ఇప్పటికే నెలరోజులకు పైగా లాక్ డౌన్ అమలులో ఉండడంతో తిరుమలకు బక్తుల రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తం ఖాళీ వీధులు కనిపిస్తున్నాయి. కాటేజీలు అన్ని నిర్మానుష్యంగా ఉన్నాయి. షాపులుమూతపడ్డాయి. సాదారణంగా ఈ కాలానికి తిరుమలకు 250 కోట్ల ఆదాయం వచ్చి ఉండేదని ఒక అంచనా.హుండీ లో భక్తులు వేసే కానుకలు, కాటేజీల అద్దెలు తదితర రూపాలలో ఈ ఆదాయం వస్తుంటుంది. ఇప్పుడు ఆదాయం దాదాపు లేకపోవడంతో తిరుమల నిర్వహణ భారంగా మారుతోంది. అయితే ఆలయానికి సుమారు రెండువేల కోట్ల రూపాయల డిపాజిట్లు ఉండడంతో వాటి పై వచ్చే వడ్డీతో నిర్వహణ పనులు సాగిస్తున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తిరుమల కొండమీదకు చేరుకున్న భక్తులు ఒక్కసారిగా స్వామి వారి దర్శనం చేసుకోగానే అన్ని ఇబ్బందులను ఇట్టే మర్చిపోతారు. మనస్పూర్తిగా తమకు తోచినంత కానులకు స్వామివారిక సమర్పించడం కూడా ఏడుకొండల మీద నిత్యం జరిగే తంతు. ఏడుకొండల వెంకన్నను దర్శించుకోవడానికి ఎంత ఇష్టపడతారో అక్కడ లభించే ప్రసాదం, లడ్డూను సొంతం చేసుకోవడానికి కూడా భక్తులు అంతే పోటీ పడతారు. ఎంత ఖర్చైనా సరే సాద్యమైనన్ని ఎక్కువ లడ్డూలు కొని ఇంటి చుట్టుపక్కల వారికి పంచడం కూడా వెంకన్న భక్తుల ఆనవాయితీగా మారింది. లడ్డూల రూపంలో కూడా తిరుమల వెంకన్నకు గణనీయమైన ఆదాయం సమకూరనున్నట్టు తెలుస్తోంది. యాదాద్రికి తప్పని తిప్పలు గుట్టకు వేలాదిగా వచ్చే భక్తులకు అవసరమైన సేవలు అందించేందుకు, యాదాద్రి ఆలయ సాధారణ నిర్వహణ, ఉ ద్యోగుల జీతభత్యాలకు ప్రతి నెలా రూ.2 కోట్ల మేర వ్యయం అవుతోంది. ఆలయంలో అర్చకులు మొదలు, నాలుగో తరగతి సిబ్బంది వరకు మొత్తం 285మంది పనిచేస్తున్నా రు. 128మంది పెన్సనర్లు, 50 మంది వరకుఅవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారు. పర్మినెంట్ ఉద్యోగులకు ప్రతినెలా రూ.1.05కోట్లు, పెన్షనర్లకు రూ.35 లక్షలు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతభత్యాలకు రూ.10 లక్షలు చెల్లిస్తున్నారు. ఇవేగాక, ఆలయ భద్రత, హౌస్ కీపింగ్, విద్యుత్, నీటి సరఫరా కోసం ప్రతినెలా రూ.50లక్షల వ్యయం అవుతోంది. ప్రతి నెలా ఆలయానికి వచ్చే ఆదాయంలో 33శాతం దాటకుండా జీతభత్యాల కోసం వ్యయం చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా భక్తులకు ప్రవేశం లేకపోవడంతో ఆలయ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. మార్చి 22వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలు కాగా, ఒక వారంలోనే గత ఏడాది మార్చి నెల కంటే రూ.5.09కోట్ల మేర ఆదాయం తగ్గింది. 2019 మార్చి మాసంలో స్వామివారికి రూ.13.59 కోట్ల ఆదా యం రాగా, ఈ ఏడాది మార్చిలో మూడు వారాలకు కేవలం రూ.8.49 కోట్లుమాత్రమే వచ్చాయి. సాధారణంగా ఏప్రిల్, మే మాసాల్లో ఆలయానికి అత్యధిక ఆదాయం వస్తుంది. లాక్ డౌ తో ఈ రెండు మాసాల్లో సుమారు రూ.25 కోట్లకు పైగా ఆదాయం కోల్పోయే అవకాశముంది. ఆలయానికి రాబడి నిలిచిపోయినా, ఉద్యోగులకు మార్చి నెలలో 50శాతం వేతనాలు చెల్లించారు. ఇక ఏప్రిల్, మే నెలలతో పాటు వచ్చే కాలంలో ప్రభుత్వ ఆంక్షలు కొనసాగితే వేతనాల చెల్లింపుల కోసం బ్యాంకుల్లో ఉన్న ఆలయ ఫిక్స్ డ్ డిపాజిట్ల పైఆధారపడక తప్పదు.