టాప్ వన్ నాయకుడిగా నరేంద్ర మోడీ..!

ప్రపంచ దేశాల్లో పెరిగిన ప్రధాని మోడీ ఇమేజ్ – అయిదో స్థానంలో అమెరికా.

జ్యోతిన్యూస్ : ప్రపంచ నాయకుల ఎంపికలో అత్యధిక ఆమోదం పొందిన రాజకీయ నాయకుడిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ దూసుకుపోతున్నారు. పాలన విషయంలోను, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు అందరి 

ప్రశంసలు పొందుతున్నారు. ప్రపంచ రాజకీయ నాయకులను సైతం వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్థానంలో ముందుకు సాగుతున్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించిన తీరు ఆయనకు మరింత ప్రజాదరణను పెంచిందని ‘మార్నింగ్ కన్సల్ట్’ అనే అమెరికాకు చెందిన సర్వే, పరిశోధన సంస్థ పేర్కొంది. ఆ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన పోల్ సర్వేలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. లాక్ డౌన్ కు ముందు కూడా టాలోనే ఉండగా, ఇప్పుడు కూడా తన స్థానాన్ని కాపాడుకున్నారు. మార్చి 17వ తేదీన నిర్వహించిన సర్వేలో 74 శాతం మంది భారతీయులు మోడికే ఓటు వేయగా, తాజాగా మే 19న నిర్వహించిన పోల్ లో మరో 8 శాతం ఓట్లు 

పెంచుకుని 82శాతం ఓట్లను సంపాదించారు. మోదీ తర్వాత రెండో స్థానంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ 66శాతం ఓట్లను దక్కించుకున్నారు. మూడో స్థానంలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మొర్కెల్, నాలుగో స్థానంలో ప్లేస్ జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, బోరిస్ జాన్సన్ ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక కరోనా వైరస్ కేసులు, మరణాలతో అమెరికా దేశాన్ని నడిపించినప్పటికీ, సంక్షోభ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం రేటింగ్ మాత్రం చాలా స్థిరంగా ఉంది. అయిదో స్థానంలో ట్రంప్ ఉన్నారు