ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాలకు జ్యోతి వెలిగిద్దాం

కరోనాను తిప్పికొట్టే సంకల్పంతో అందరూ ఏకం కావాలని ప్రధాని వీడియో సందేశం

-దేశప్రజలంతా మరోసారి ఐక్యత చాటాలి -జనతా కర్ఫ్యూతో శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి చాటారు -ప్రపంచ దేశాలన్నీ మన బాటలోనే నడుస్తున్నాయి -ప్రకాశంతో అంధకారాన్ని తరుముదాం -సంకట సమయంలో ఇది సమరోత్సాహాన్నిస్తుంది -సంకల్పాన్ని మించిన శక్తి ఎక్కడా లేదు -కరోనాపై పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

‘మేము ఒక్కరమే ఇంట్లో ఉంటే ఏమి సాధిస్తామని ప్రజలు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటే కరోనాను జయించినట్లే. జనతా కర్వ్యూ ద్వారా భారతీ యులు తమ శక్తి సామర్థ్యాలు చాటారు. భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు మన బాటలోనే నడుస్తున్నాయి. లాక్ డౌన్‌ను మరింత కఠినంగా పాటించాలి. ఈ ఆదివారం దేశ ప్రజలంతా కరోనాను తిప్పికొట్టే సంకల్పం తీసుకోవాలి. సంకట సమయంలో ఇది భారతీ యులకు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది. మన సంకల్పాన్ని మించిన శక్తి ప్రపంచంలో ఏదీ ఉండదు. కరోనాపై పోరాడుతున్న అందరికీ ధన్యవాదాలు” -నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: భారతీయులంతా ఏకమై కరోనాను తరిమికొడతారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఉ దయం దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని వీడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 130 కోట్ల మంది ప్రజల సామూహిక శక్తి.. ప్రతి ఒక్కరిలో కనిపించిందన్నారు. దేశమంతా ఒక్కటై కరోనాపై పోరాటం చేసిందన్నారు. ప్రజలు ఈశ్వర స్వరూప మన్నారు. కోట్లాది మంది ప్రజలు ఇండ్లల్లో ఉన్నారన్నారు. కరోనాతో ఏర్పడిన నిరాశ నుంచి ఆశ వైపు ప్రజల్ని తీసుకువెళ్లాలన్నారు. కరోనాతో ఏర్పడిన అంధకారాన్ని పోగొట్టేందుకు దివ్య వెలుగుల్ని ప్రసరింపచేయాలన్నారు. ఏప్రిల్ 5వ తేదీన.. 130 కోట్ల మంది ప్రజలు మహాశక్తి జాగరణ చేయాలన్నారు. దేశ ప్రజలు మహాసంకల్పాన్ని ప్రదర్శించాలన్నారు. ఆ రోజు రాత్రి 9 గంటలకు ప్రతి ఒక్కరూ ఇంట్లో లైట్లు బంద్ చేసి.. దీపాలను వెలిగించాలన్నారు. కేవలం 9 నిమిషాల సమయాన్ని కేటాయించాలన్నారు. టార్చ్ లైట్ అయినా.. దీపం అయినా వెలిగించాలన్నారు. ఆ ప్రకాశంతో అంధకారాన్ని పారద్రోలాలన్నారు. మేం ఒంటరిగా లేమన్న సందేశాన్ని వినిపించాలన్నారు. ” మేము ఒక్కరమే ఇంట్లో ఉంటే ఏమి సాధిస్తామని ప్రజలు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటే కరోనాను జయించినట్లే. జనతా కర్వ్యూ ద్వారా భారతీయులు తమ శక్తి సామర్థ్యాలు చాటారు. భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు మన బాటలోనే నడుస్తున్నాయి. లా డౌన్‌ను మరింత కఠినంగా పాటించాలి. ఈ ఆదివారం దేశ ప్రజలంతా కరోనాను తిప్పికొట్టే సంకల్పం తీసుకోవాలి. ఆదివారం రాత్రి 9గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు బంద్ చేసి కొవ్వొత్తులు, దివ్వెలను వెలిగించాలి. 130 కోట్ల మంది ..ఈ సమయాన్ని నాకు ఇవ్వాలని కోరుతున్నా. సంకట సమయంలో ఇది భారతీయులకు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది. మన సంకల్పాన్ని మించిన శక్తి ప్రపంచంలో ఏదీ ఉండదు. కరోనాపై పోరాడుతున్న అందరికీ ధన్యవాదాలు” అని మోదీ అన్నారు. ఎవరూ కూడా రోడ్లపై వెళ్లకూడదన్నారు. సామాజిక దూరాన్ని ఎప్పుడూ ఉ ల్లంఘించకూడదన్నారు. కరోనా సైకిల్ ను బ్రేక్ చేసేందుకు ఇదొక్కటే మార్గమని ప్రధాని తెలిపారు. 5వ తేదీన ఒంటరిగా కూర్చుని మహాభారతాన్ని గుర్తు చేసుకోండన్నారు. 130 కోట్ల ప్రజల సంకల్పాన్ని ఆలోచించాలన్నారు. గెలవాలన్న ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవాలన్నారు. మన ఉత్సాహాన్ని మించిన శక్తి ఏదీ లేదన్నారు. ఈ ప్రపంచంలో మనశక్తితో జయించలేనిది ఏదీ లేదన్నారు. కోవిడ్ 19 మహమ్మారిని తరిమేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిసి కట్టుగా పోరాడుతున్నాయని మోదీ అన్నారు. ఆరోగ్య దేశాన్ని నిర్మించేందుకు వీలైనన్ని చేస్తున్నట్లు ఆయన చెప్పారు. లాక్ డౌన్ నిర్ణయానికి మద్దతు ఇచ్చిన అన్ని రాష్ట్రాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణనష్టాన్ని వీలైనంత వరకు తగ్గించాలన్న లక్ష్యంతో పనిచేయాలని ప్రధాని అన్నారు. రానున్న వారాల్లో.. టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేషన్, క్వారెంటైన్ పై అన్ని ప్రభుత్వాలు దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికే దేశాన్ని ఉద్దేశించి రెండుసార్లు ప్రధాని మోదీ మాట్లాడిన విషయం తెలిసిందే. కొవిడ్-19 పై భారత్ చేస్తున్న పోరాటాన్ని చాలా దేశాలు అనుసరిస్తున్నాయన్నారు. జనతా కర్ఫ్యూతో దేశ ప్రజలు తమ సామర్థ్యాన్ని చాటారని కొనియాడారు. దేశ ప్రజలంతా ఒక్కటిగా నిలిచి కరోనాను జయించాలని పేర్కొన్నారు. ఐక్యంగా పోరాడితేనే విజయం సాధిస్తామనీ.. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటే కరోనాను జయించినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని జయించేందుకు రాబోయే ఐదు రోజులు అత్యంత కీలకమని ఆయన గుర్తుచేశారు. కాగా కరోనాపై విజయం సాధించేందుకు దేశ ప్రజలంతా మరోసారి సంకల్పం చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5న ఆదివారం రాత్రి కరోనా చీకట్లను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఆరోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పేయాలన్నారు. ఎవరెక్కడున్నా లైట్లు ఆరేసి దీపాలు వెలిగించాలని ప్రధాని కోరారు. ఈ సందర్భంగా సామాజిక దూరం (సోషల్ డిస్టెన్సింగ్) పాటించాలని కోరారు. విద్యుత్ లైట్లన్నీ ఆర్పివేసి కొవ్వొత్తి, దీపం లేదా మొబైల్ ఫ్లాష్ లైట్ వెలిగించాలన్నారు. తద్వారా దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు మరోసారి కరోనాను పారదోలేందుకు తమ సంకల్పం చాటాలని ప్రధాని కోరారు. ప్రజలు వెలిగించే దీపాలు కరోనాపై పోరాడే వైద్యులు, అత్యవసర సేవల సిబ్బందిలో మరింత స్ఫూర్తి నింపాలని ఆకాంక్షించారు. క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్ కరోనా వైరస్(కొవిడ్-19) పై జరుగుతున్న యుద్ధం గురించి దేశవ్యాప్తంగా ప్రముఖ క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ, టీమ్? ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ సహా మొత్తం 49మంది క్రీడాకారులు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని క్రీడాకారులను మోదీ కోరారు. అభిప్రాయాలను అడిగి తెలుసున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు ప్రధాని మోదీ ఐదు సూత్రాలను ఉపదేశించారు. కరోనాపై యుద్ధంలో ‘సంకల్స్(సంకల్పం), సన్యం(సమన్వయం), సంక్రమత(సానుకూలత), సమ్మాన్(ఐకమత్యం), సహయోగ్(సహాయం).. అనే సూత్రాలను పాటించాలని, దేశ ప్రజల్లో ధైర్యాన్ని, సానుకూలతను నింపాలని క్రీడాకారులకు సూచించారు. కరోనాపై గెలిచేందుకు విరాట్ కోహ్లి లాగా అందరం పోరాట స్పూర్తి కనబరచాలని ప్రధాని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో టీవ్, ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ, మహమ్మద్ షమీ, పుజార, మాజీ ఆటగాళ్లు వీరేందర్ సెహ్వాగ్, యువరాజ్, జహీర్ ఖాన్, దిగ్గజ క్రింటన్ పీటీ ఉషా, యువ అథ్లెట్, హిమదాస్, రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ దిగ్గజ బాక్సర్, మేరీకోమ్ తో పాటు పలు క్రీడా విభాగాల్లోని అథ్లెట్లు పాల్గొన్నారు.