సాంకేతిక వ్యవసాయమే శరణ్యం

వ్యవసాయానికి సాగునీరు అందించేందుకు అవసరమైన విద్యుత్‌ సరఫరాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాులు ఇస్తున్న రాయితీ లవ్యయం అక్షరాలా లక్ష కోట్ల రూపాయలకు చేరింది. దేశంలో సాగునీటిని పొదుపుగా వాడేందుకు గట్టి ప్రయత్నాలేవీ జరగకపోవడంతో నీరే కాకుండా అనేక మివైన వనయీ హరించుకుపోతున్నాయి. పెరుగుతున్న దేశ జనాభాకు ఆహార భద్రత కల్పించడానికి పంట సాగు, దిగుబడు, ఉత్పాదకత పెంపు తథ్యం. నీటి సరఫరాకు ఎన్ని క్ష కోట్ల రూపాయ ప్రజాధనమైనా అవోకగా ధారపోస్తున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న వనరు నుంచి సాగునీటిని ఆధునాతన విధానా ద్వారా సరఫరా చేస్తే 30 శాతం ఆదా అవుతుంది. ఇలా ఆదా అయ్యే నీటినే ఇతర పంటకు అదనంగా వాడుకోవచ్చు. అవసరానికి మించి నీటిని వాడటం వ్ల అనేక అనర్థాు తప్పడం లేదు. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో సాగునీటి పొదుపుపై చర్చలే కాకుండా కార్యాచరణా చాలా అవసరం.
మనదేశంలో పంట సాగుకు నీరు ఎక్కువగా వృథా అవుతోంది. నీటి పంపిణీ వ్యవస్థు సక్రమంగా లేకపోవడం, పొదుపుగా వాడే పరిజ్ఞానం కొరవడటంతోపాటు పురాతన పద్ధతునే పాటిస్తూ ఉండటం ఇందుకు ప్రధాన కారణాు. అతి తక్కువ నీటివనరుతో ఇజ్రాయెల్‌లో అద్భుత పంట దిగుబడు సాధిస్తూ పండ్లు, కూరగాయను ఐరోపా దేశాకు ఎగుమతి చేస్తున్నారు. మనదేశంలో మొత్తం 36 రకా వాతావరణ ప్రాంతాున్నాయి. ప్రాంతాను బట్టి కిలో వరి ధాన్యం పండిరచడానికి గరిష్ఠంగా 5,263 లీటర్ల నీటిని కొన్ని రాష్ట్రాల్లో వరదలా పారిస్తున్నారు. భారతదేశ జాతీయ సగటు వినియోగం 3,032 లీటర్లు. చైనాలో వాడే సగటు 1,321 లీటర్లకన్నా మనదేశంలో కొన్ని ప్రాంతా రైతు 298 శాతం అధికంగా వాడుతున్నారు. ఆఖరికి ప్రపంచ సగటు నీటి వినియోగం 2,300 లీటర్లతో పోల్చినా- మనదేశ రైతు 128 శాతం దాకా అధికంగా వాడుతున్నారు. ఇజ్రాయెల్‌లో వార్షిక సగటు వర్షపాతం 145 మిల్లీమీటర్లు(మి.మీ.). మనదేశంలో 650 మి.మీ.ు. గత జూన్‌-సెప్టెంబరు మధ్య 968 మి.మీ.ు వర్షపాతం నమోదైంది. ఇంత భారీ వర్షాు కురుస్తున్నా కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుతో సాగునీరందక పంటు ఎండిపోతున్నాయి. అపార జవనయిన్నా పొదుపుగా వాడుకునే విధానా కొరత అధికంగా ఉంది. తక్కువ నీటి వినియోగంతో అధిక పంట సాగు క్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి క ృషి సించయి యోజన’(పీఎమ్‌కేఎస్‌వై) పథకాన్ని అముచేస్తోంది. ఈ పథకాన్ని రాష్ట్రాు సరిగ్గా వాడుకోక పోవడంవ్ల వే కోట్ల రూపాయ నిధు మిగిలిపోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20)లో ఈ పథకానికి రూ.9,682 కోట్లు కేటాయిస్తే అందులో రూ.7,896 కోట్లే వినియోగించినట్లు కేంద్రం తాజా బడ్జెట్లో వ్లెడిరచింది. ఈ పథకం సద్వినియోగం కావాంటే వ్యయంలో 40శాతం రాష్ట్రాు భరించాలి. కొన్ని రాష్ట్రాు ముందుకు రాకపోవడంతో పథకం నీరుగారుతోంది. సాగునీటి పొదుపు కార్యక్రమాకు కేంద్రం భారీగా నిధు ఖర్చు చేస్తున్న ఏకైక పథకం ఇదొక్కటే. వచ్చే ఏడాదికి రూ.11,127 కోట్లు కేటాయించారు. ఒక్కో రైతు పొంలో బిందు, తుంపర్ల సేద్యం పరికరాు అమర్చుకుంటే సాధారణ పద్ధతుల్లోకన్నా 50శాతం తక్కువ నీటితో ఎక్కువ పంటను పండిరచడానికి ఎన్నో అధునాతన విధానాు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా పు దేశాు అధిక దిగుబడు సాధిస్తున్నాయి. ఉదాహరణకు బ్రెజిల్‌లో సాగునీటిని తుంపర్లుగా వెదజల్లే విధానంలో వరి పండిస్తూ హెక్టారుకు 60 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి సాధిస్తున్నారు. మనదేశంలో అంతకన్నా 70శాతం ఎక్కువ నీటిని వరదలా పారించే పొలాల్లో సైతం అంతకుమించి దిగుబడు రావడంలేదు. వరి సాగు అధికంగా ఉన్న పంజాబ్‌లో కిలో ధాన్యం పండిరచడానికి అత్యధికంగా 5,263 లీటర్ల మేర నీటిని వాడుతున్నారు. బిందు, తుంపర్ల సేద్యంతో నీటిని పొదుపుగా పైర్లకు సరఫరా చేసే పరికరాను పీఎమ్‌కేఎస్‌వైతో పాటు రాష్ట్రా సొంత పథకా కింద వందశాతం రాయితీతో ఇస్తున్నారు. ఉదాహరణకు ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఒక రైతు పొంలో బిందు లేదా తుంపర్ల సేద్యం పరికరా ఏర్పాటుకు గరిష్ఠంగా రూ.5.16 క్షు, తెంగాణలో రూ.4.49 క్షు, ఏపీలో రూ.4.00 క్షను రాయితీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు భరిస్తున్నాయి. ఒక్క తెంగాణలోనే గత 15 ఏళ్ల(2003-20)లో 18.16 క్ష ఎకరాల్లో ఈ పరికరా ఏర్పాటుకు ఇప్పటికే రూ.3,900 కోట్లను రైతుకు రాయితీ రూపంలో పంచిపెట్టారు. ఈ నిధు వ్యయంతో పంట దిగుబడి పెరగడమే కాకుండా 30శాతం వరకూ నీటి ఆదా క్ష్యాన్ని సాధించినట్లు ఉద్యానశాఖ అధ్యయనంలో గుర్తించారు. కొన్ని పంట సాగులో నీటి ఆదా 50శాతం వరకూ ఉంది. దేశవ్యాప్తంగా 14.50కోట్ల మంది రైతు భూమున్నింటికీ ఇదేతీరున ఏర్పాటుచేస్తే దేశవ్యాప్తంగా ఎంతో సాగునీరు ఆదా అవుతుంది. భారత్‌లో బాగా అభివ ృద్ధి చెందిన రాష్ట్రాుగా పేరొందిన పంజాబ్‌, తమిళనాడు, తెంగాణ వంటి రాష్ట్రాల్లో వరిసాగుకు అధికంగా నీటిని వాడుతుండగా బాగా వెనకబడిన బిహార్‌లో రైతు చాలా తక్కువగా వినియోగిస్తున్నారు. వే కోట్ల రూపాయతో భారీ సాగునీటి ప్రాజెక్టు నిర్మించి ఏటా క్ష కోట్ల రూపాయు వెచ్చించి కరెంటు ఇచ్చి మివైన నీటిని అవసరానికి మించి పొలాకు పారించడం వ్ల పంట దిగుబడు పెరగవు.
చైనా, ఇజ్రాయెల్‌, నెదర్లాండ్స్‌ తదితర దేశాల్లో భారత్‌కన్నా పంట ఉత్పాదకత చాలా ఎక్కువగా ఉంది. ఉదాహరణకు నెదర్లాండ్స్‌లో ఎకరానికి 200 టన్ను టమోటాను ఏడాదిలో పండిస్తున్నారు. అదే ఎకరానికి అధికంగా సాగునీరు ఇచ్చినా అందులో సగం దిగుబడైనా మనరైతుకు దక్కడం లేదు. తెంగాణలో బిందుసేద్యం విధానంలో నీరు అందిస్తే కిలో ధాన్యం పండిరచడానికి సగటున 1,118.8 లీటర్లు చాని పరిశోధనల్లో తేలింది. సాధారణ పద్ధతిలో క్వా ద్వారా నీరు అందిస్తున్న రైతు అదే కిలో ధాన్యం పండిరచడానికి 2,558 లీటర్లు వాడుతున్నట్లు జయశంకర్‌ వర్శిటీ అధ్యయనంలో గుర్తించారు. కేవం అధునాతన పరిజ్ఞానం వాడకపోవడం వ్ల కిలో ధాన్యానికి వ ృథా చేస్తున్న నీరు 1,439 లీటర్లని గుర్తించారు. మనదేశంలో అనేక రంగాకు రాయితీ రూపంలో ఏటా వే కోట్ల రూపాయు ధారపోస్తున్నారు. వాటిని మిగ్చుకునే పరిజ్ఞానాన్ని రైతుకందించే కార్యక్రమాకు నిధు ఉండటం లేదు. ఆసియా ఖండంలో మరో అయిదేళ్లకల్లా 5.50కోట్ల ఎకరా వరి పొలాకు సాగునీటి కొరత తీవ్రంగా ఉంటుందని అంచనా. ఇప్పటికే 118 దేశాల్లో సాగవుతున్న వరి పంట వ్ల నీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంది. 2050నాటికి ప్రపంచ ఆహార భద్రత కోసం ఇప్పటికన్నా మరో 70 శాతం అదనపు పంట దిగుబడు పెరగాలి. అది జరగాంటే నీటి వనరునే పొదుపుగా వాడుకుంటూ    అదనపు విస్తీర్ణానికి అందించాలి. సాగునీటి ప్రాజెక్టు కట్టే సమయంలోనే వాటినుంచి బిందు, తుంపర్ల రూపంలో ఆయకట్టుకు నీటి సరఫరా చేసే పథకాకూ నిధు కేటాయింపు ఉండాలి. అప్పుడే ప్రాజెక్టుకు వెచ్చించే వే కోట్ల రూపాయు, వాటి నుంచి నీటిని తీసుకునేందుకు సరఫరా చేసే కరెంటుకు వెచ్చించే సొమ్ము, బయటికి వచ్చే నీరు సద్వినియోగమవుతాయి. ఇప్పటికే నీటి కొరతతో అనేక దేశాు కరవు కాటకాల్లో అల్లాడుతున్నాయి. జీవనదున్న మనదేశంలోనూ ప్రతి పంట సీజన్‌లో మూడోవంతు     భారతావని సాగునీటి కొరతతో అవస్థు పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారం భించాంటే జసంరక్షణ, నీటి పొదుపు పథకాలే శరణ్యం! దేశవ్యాప్తంగా బిందు, తుంపర్ల సేద్యం పరికరాను అన్ని కమతాల్లో వినియోగిస్తే, ఇప్పుడు వాడుతున్న నీటిలో సగటున 40శాతం పొదుపు అవుతుంది. దీంతోనే అదనంగా మరో 71.8శాతం భూ విస్తీర్ణానికి సాగునీరు అందించవచ్చు. భారతదేశంలో వ్యవసాయానికి అందుబాటులో ఉన్న మొత్తం సాగునీటిలో 60శాతం కేవం రెండు పంటు వరి, చెరకు సాగుకే వినియోగమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పంటకు వాడుతున్న నీటి శాతం 45. మనదేశంలో అంతకన్నా మరో 15శాతం ఎక్కువ ఉంది. పైగా మొత్తం దేశ పంట సాగు విస్తీర్ణంలో ఈ రెండిరటి సాగు విస్తీర్ణం 24 శాతమే. ఇంత తక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న పంటకే అత్యధిక నీటిని వినియోగిస్తున్న దేశం మరొకటి లేదు. సాగునీటి భ్యతపైనే ద ృష్టి పెడుతూ ఏటా వే కోట్ల రూపాయు గుమ్మరిస్తున్న ప్రభుత్వాు, అదే నీటిని పొదుపుగా, ప్రతి నీటిబొట్టు సద్వినియోగమయ్యేలా పదోవంతైనా వెచ్చించడం లేదు. ఉదాహరణకు ప్రస్తుత ఏడాది(2019-20)లో వ్యవసాయ, సాగునీటి పారుద రంగాకు పాతిక వేకోట్ల రూపాయకు పైగా ఖర్చుపెట్టిన తెంగాణ ప్రభుత్వం నీటి పొదుపు కోసం అము చేస్తున్న బిందుసేద్యం పథకానికి నిధు లేవంటూ, ఈ ఏడాది అమును ఆపేసింది. ఉచితంగా ఇస్తున్న వ్యవసాయ విద్యుత్‌కు ఏటా క్ష కోట్ల రూపాయు రాయితీ రూపంలో ఈ ఏడాది ఖర్చుచేస్తున్నారు. కానీ బిందుసేద్యం ద్వారా సాగునీటిని అందిస్తే వ్యవసాయ విద్యుత్‌లో 33.6శాతం ఆదా అవుతుందని అంచనా. అంటే అన్నీ కమతాకు బిందుసేద్యం అమలైతే క్ష కోట్ల రూపాయల్లో రూ.33,600 కోట్లు మిగిలేవి. ఇలాగే ఈ ఏడాది ఎరువుకు రూ.70 వే కోట్లు రాయితీలిచ్చారు. బిందుసేద్యం గొట్టా ద్వారా ఎరువు పంపితే కనీసం 30శాతం వినియోగం తగ్గి రూ.20 వే కోట్లు మిగిలేవి.