ప్రమాదంలో బాలల భవిత

బాలల భద్రత ప్రమాదంలో పడిరదని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌, లాన్సెట్‌ పత్రిక సంయుక్తంగా నిర్వహించిన విస్త ృత అధ్యయనంలో తేలిన కఠోర వాస్తవం ప్రపంచ దేశాలను నివ్వెరపోయేలా చేసింది. దాదాపు ఏ దేశమూ ప్లి ఆరోగ్యాన్నీ, పర్యావరణాన్నీ, వారి భవిష్యత్తును తగిన విధంగా పరిరక్షించలేకపోతున్నట్లు తాజా ధ్రువీకరణ ప్రతిఒక్కర్నీ నిశ్చేష్ట పరుస్తోంది. పసిప్లి మరణాల్లో 23శాతానికి పర్యావరణ క్షీణత కారణమవుతున్నదని గతంలోనే ప్రపంచబ్యాంకు వ్లెడిర చింది. ప్రపంచ దేశాల్లో బాలకు తగిన భద్రతాయుతమైన పరిస్థితు ఉన్నాయో లేదో నిగ్గు త్చేమని 40మంది ఆరోగ్య నిపుణుతో ఏర్పాటుచేసిన కమిషన్‌ ‘ప్రపంచ బాలకు ఒక భవిష్యత్తు’ శీర్షికతో ఈ నివేదిక ఇచ్చింది. బాల ఆరోగ్యం, పరిసరాు, పర్యావరణం, భవిష్యత్తును కాపాడే విధంగా చర్యు చేపడుతున్న దేశం ఒక్కటీ లేదని ఆ నివేదిక కుండబద్దు కొట్టింది. ఉన్నంతలో నార్వే, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాల్లో శిశుసంక్షేమం మెరుగ్గా ఉందని ఆ నివేదిక పేర్కొంది. మధ్య ఆఫ్రికా, చాద్‌, సోమా లియా తదితర దేశాు ఈ అంశంపై పూర్తి అథోగతిలో ఉన్నాయని పేర్కొంది. శిశువు బతికి బట్టకట్టి క్షేమంగా మనగలిగే అవకాశా ప్రాతిపదికన 180దేశా జాబితాలో భారత్‌కు 131వ స్థానం దక్కింది. అలాగే బాల సుస్థిర ఆరోగ్యం విషయంలో భారతకు 77వ స్థానం భించింది. ఈ నివేదికను గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా బాల విద్యపై యునెస్కో (ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ, సాంస్క ృతిక సంస్థ) నిరుడు జూలైలో విడుద చేసిన నివేదికలోని అంశాు జ్ఞప్తికి వస్తాయి. 2030నాటికి ఆరు నుంచి పదిహేడు ఏళ్ల మధ్య గ ప్రతి ఆరుగురి బాల్లో ఒకరు బడి ముఖం చూడలేరనీ, అలాగే ప్రాథమిక విద్య వయసులోని ప్రతి పదకొండు మందిలో ఒకరు స్కూుకు వెళ్లలేని స్థితిలో చిక్కుకుంటారని ఆ నివేదిక తెలిపింది. యునిసెఫ్‌ 2019 ప్రపంచ బాల స్థితిగతు నివేదిక ప్రకారం 2018లో ఐదేళ్లలోపు 14కోట్ల 90క్ష మంది బాలు తక్కువ ఎదుగుదతో ఉన్నారనీ, ఐదు కోట్ల మంది తక్కువ బరువుతో రోగనిరోధక శక్తి లేమితో బాధపడుతున్నారని తేల్చింది. భారత్‌లో 69శాతం మంది ప్లిు పోషకాహార లేమితో కన్నుమూస్తున్నారనీ, 17శాతం మంది బాలు రోగనిరోధకశక్తి, వయసుకు తగ్గ ఎత్తులేనివారనీ,33శాతం మంది తక్కువ బరువుగవారని ఆ నివేదిక వ్లెడిరచింది. తాజా నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కౌమార దశ ప్లిల్లో ఊబకాయం విపరీతంగా పెరిగినట్లు ఆందోళనకర అంశం మెగులోకి వచ్చింది. ఇది 1975లో కోటి పదిక్ష మందిలో ఉంటే.. 2016నాటికి ఈ సంఖ్య 12కోట్ల 40క్షకు చేరింది. రేపటి తరానికి భద్రమైన భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు 2030నాటికి బొగ్గుపుసు వాయువు తసరి ఉద్గారాను నిర్ధారిత స్థాయికి పరిమితం చేయగ సామర్థ్యం ఏయే దేశాకు ఉందో నివేదిక మదింపు వేసింది. అల్బేనియా, ఆర్మీనియా, గ్రెనడా, జోర్డాన్‌, మాల్దోవా, శ్రీంక, టునీసియా, ఉరుగ్వే, వియత్నాం కే ఈ జాబితాలో చోటు దక్కింది. మరో పదేళ్లలో వార్షిక కర్బన ఉద్గా రాు 39.7గిగా టన్ను నుంచి 22.8గిగా టన్నుకు తగ్గితేనే కొంతైనా పరిస్థితిలో మెరుగుద ఉంటుందని పేర్కొంది. ఈ విషయంలో భారత్‌ ఎంతో చేయాల్సి ఉంటుంది. సంపన్న దేశాల్లో బొగ్గు పుసు వాయువు విడుద బాలందరి ఆరోగ్యానికి ముప్పు తెస్తున్నదని నివేదిక నిగ్గు తేల్చిన విషయం ప్రత్యేకించి గమనించాల్సి ఉంది.
రేపటి పౌయి జీవించే, రక్షణ పొందే, గౌరవంగా పురోభివ ృద్ధి సాధించేలా హక్కు పరిరక్షణ ఒడంబడికను తీర్చిదిద్దడానికి ఐక్యరాజ్యసమితి మూడు దశాబ్దా నాడే సంకల్పించింది. వివిధ దేశాల్లోని స్థితిగతును అంచనావేస్తూ అలా చేయడం వ్ల ఒనగూరే ప్రయోజనాలేమిటో కూడా వివరించింది. వాస్తవానికి ఒక తరానికి వెనక్కి వెళితే ఏటా 44క్ష శిశు మరణాు, తొమ్మిదిన్నర కోట్ల మంది బాకార్మికుగా మారే దుస్థితి, పదకొండున్నర కోట్ల మంది బాలు బడికి దూరంగా ఉండే దుర్గతి నుంచి మనం చాలా వరకూ మెరుగయ్యామని అర్థమవుతోంది. అయితే ఇప్పటికీ రెండు అంశాు ప్లి పాలిట పెనుశాపంగా ఉంది. పర్యావరణ విధ్వంసం ఒకటైతే, రెండోది ప్లిను క్ష్యంగా చేసుకుని సాగుతున్న వాణిజ్య పోరు. పర్యావరణ విధ్వంసం అంటే అభివృద్ధి పేరిట అడవునరికివేత, శిలాజ ఇంధనాను విచ్చవిడిగా వినియోగించడం, వాతావరణంలో బొగ్గుపుసు వాయువు శాతం అసాధారణంగా పెరగడం వ్ల ఆహారధాన్యా ఉత్పత్తి తగ్గి పౌష్టకాహార లేమి తలెత్తుతున్నది. పగు, రాత్రి ఉష్ణోగ్రతల్లో తేడాు పెరగడం వ్ల డెంగీ, మలేరియా, అతిసారం తదితర కొత్తరకా వ్యాధు పెరిగిపోతున్నాయి. ఫాస్ట్‌ఫుడ్‌, శీతపానీయాు, పొగాకు, మద్యం ఉత్పత్తుకు సంబంధించి వాణిజ్య పోరు తారస్థాయికి చేరడంతో బాలపై అవాంఛనీయ దాడి ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం. ఈ రెండు కారణా వ్ల ప్లిల్లో జీవనసరళి వ్యాధు ముమ్మరిస్తున్నాయి. ఏడు శాతానికి పైగా ప్లిు మూత్రపిండా వ్యాధు, పందొమ్మిదేళ్ల లోపు వారిలో పదిశాతానికి మధుమేహం చుట్టుముడుతున్నాయి. రెండు దశాబ్దా కాంలో దేశంలో పోషకాహార లేమి మరణా శాతం తగ్గినప్పటికీ ఏటా ఏడు క్ష మంది వరకూ ప్లిు బలైపోతున్నారు. 2015-30 మధ్య ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు శిశువు ఏడుకోట్ల మంది ప్రాణాు గాలిలో కలిసిపోతాయనీ, అందులో కనీసం 18శాతం భారత్‌ లోనేనన్నది ఐరాస జోస్యం! వ్యాక్సిన్ల ద్వారా నివారించదగిన వ్యాధు బారిన పడి ఏటా ఐదేళ్లలోపు అరవైవే మంది కన్నుమూస్తున్నారు. కాబట్టి మెరుగైన పోషకాహారం, సకాంలో టీకాు, చౌకలో యాంటీ బయటిక్స్‌ సమకూర్చేందుకు పాకు మరింతగా క ృషిచేయాల్సిన అవసరాన్ని ఈ గణాంకాు వక్కాణిస్తున్నాయి. నేటి బాలే రేపటి పౌరునే స్పృహతో వ్యవహరించవసిన ప్రభుత్వాు బాల్యాన్ని బలి తీసుకునే చర్యను అడ్డుకోనంత కాం రేపటి పౌరుకు భద్రమైన భవిష్యత్తు కరవే!